బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా సినిమాలు చేయకపోయినా అతని సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తో ప్రభాస్ జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాడు. దీనితో అతనితో సినిమాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా భారీ బడ్జెట్ సినిమాలు అయితేనే చేస్తున్నారు. సాహో సినిమా భారీ బడ్జెట్ తో విడుదల అయింది. ఈ సినిమా కోసం విదేశాల్లో కూడా షూటింగ్ ఎక్కువగా చేసారు.
దాదాపు రెండేళ్ళ పాటు ఈ సినిమాను షూట్ చేసారు. అయితే కథలో పట్టు లేకపోవడం, పబ్ జి గేమ్ తరహాలో సీన్లు ఉండటంతో అభిమానులు సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనితో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న జాన్ సినిమా బడ్జెట్ కూడా రు.100 కోట్ల పైమాటే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చెయ్యాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సాహో నిర్మాత వద్దకు అసలు ఖర్చు ఏ విధంగా ఉంటుంది.. ప్రభాస్ ఎలా ? వ్యవహరిస్తాడు అనే వివరాలను అడిగి తెలుసుకునేందుకు గాను కొందరు నిర్మాతలు వెళ్ళారు.
ఈ సందర్భంగా… ప్రభాస్ తో సినిమా అయితే విదేశాల్లోనే చెయ్యాలని… ఇక అక్కడ ఖర్చు వాచిపోతుందని… అతను కూడా భారీ బడ్జెట్ సినిమాలు అయితేనే చేస్తాడని చెప్పారట. దీనితో ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు. కనీసం వంద కోట్లు లేకుండా సినిమా చెయ్యడాని, అతని రేంజ్ కూడా ఆ విధంగానే ఉందని అంటున్నారు. సినిమా షూటింగ్ సమయంలో కూడా అతని వసతులు బాలివుడ్ హీరో తో సమానంగా ఉండాలని, ఎందులోనూ రాజీ పడే సమస్యే ఉండదని చెప్పారట. దీనితో ఇప్పుడు ఒక మోస్తారు నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చెయ్యాలి అనే ఆలోచనే చంపుకు౦టున్నారు.