ప్రభాస్ మరో సినిమాకు రెడీ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో కొత్త సినిమాకు రెడీ అయ్యాడా..? ఇప్పటికే బాహుబలితో నాలుగేళ్ళు.. సాహోతో రెండెన్నరేళ్ళు పనిచేసిన ప్రభాస్ ఇప్పుడు మరో కొత్త కథ అప్పుడే లైన్లో పెట్టాడనే టాక్ సిని పరిశ్రమలో జోరుగా వినిపిస్తుంది. ఇంతకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏ కథతో వస్తున్నాడు.. సాహో సినిమా జోరును దాటేసే సినిమానా అనే ఊహగానాలు మొదలయ్యాయి..

అయితే సాహో సినిమా ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రపంచమంతా సాహో మానియాలో మునిగి తేలుతుంది. ఇక ప్రభాస్ కూడా అలుపెరుగకుండా సాహో ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా విజయంపైనే ఆయన మరోసినిమా ప్రాజెక్టు ఆధారపడి ఉంటుందని అభిమానులు, సిని పండితులు లెక్కలేసుకుంటున్న తరుణంలో ప్రభాస్ మాత్రం కూల్గానే ఉండి తన తదుపరి ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాడు.

ఇప్పటికే ప్రభాస్ ఓ కొత్త కథను విన్నాడట. 1960లో యూరప్ నేపధ్యంలో జరిగిన ఓ ప్రేమ కథను ఎంచుకున్నాడట. ఈ సినిమాకు జిల్ ఫేమ్ దర్శకుడు రాధాక్రిష్ణ దర్శకత్వం వహిస్తాడట. ఈ సినిమా ఆల్ రెడీ సెట్స్ మీదనే ఉందట. ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, డబ్బింగ్ వంటి పనులు అయిపోగానే ఈ సినిమాలో కొంత షూటింగ్లో పాల్గొన్నాడట. ఇప్పటికే 20రోజుల షూటింగ్ పూర్తి చేసుకుందట ఈ సినిమా. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఉంటుందట.. కానీ భారీ బడ్జెట్ కాదట. సో ఓ యుద్ద సమయంలో చిగురించిన ప్రేమకథ సినిమా అయి ఉంటుందని సిని పండితుల ఊహ…

Share.