గ్లామర్ ప్రపంచంలో వచ్చే వరకు ఒకళా ఉంటే వచ్చాక మరోలా మారుతుంటారు. తమ వ్యక్తిగత విషయాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇక అలానే తెలుగు పరిశ్రమలో ఒక హీరోయిన్ రెండు మూడేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రావడం రావడమే హిట్ అందుకున్న ఈ అమ్మడు కెరియర్ మంచి జోష్ లో ఉంది. అయితే స్టార్ హీరో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఆ స్టార్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందట.
వేరే స్టార్ సినిమాలు చేస్తున్నా తనకు హిట్ ఇచ్చిన ఆ స్టార్ పై మాత్రం అభిమానం చూపిస్తుందట. అంతేకాదు ఛాన్స్ దొరికితే అతనితో మరో సినిమా చేయాలని చూస్తుందట. ఆ స్టార్ వస్తున్నాడని తెలిస్తే ఆమెని పిలిచినా పిలవకున్నా ఫంక్షన్స్ కు అటెండ్ అవుతుందట. పెళ్లైన స్టార్ హీరో మోజులో పడ్డ ఆ స్టార్ హీరోయిన్ అతనిలో ఏం చూసి అతని వెంట పడుతుందో ఏమో కాని ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి హీరో వైఫ్ కు తెలిసిందట.
అప్పటి నుండి హీరో మీద.. సదరు హీరోయిన్ మీద ఆ స్టార్ హీరో వైఫ్ నిఘా పెట్టిందట. చూస్తుంటే వ్యవహారం చాలా దూరమే వెళ్లేలా ఉంది. హీరోని నిలదీసి అడుగుదామని అంటే ఎక్కడ ఆ హీరోయిన్ అంటే ఇష్టమని చెబుతాడో అని కంగారు పడుతుంది ఆ హీరో వైఫ్. మొత్తానికి టాలీవుడ్ లో ఎవరికి తెలియకుండా ఓ లవ్ స్టోరీ నడుస్తుంది. మరి ఆ హీరోయిన్ కు పెళ్లైన వాడు తప్ప మరెవరు దొరకలేదా ఏమో అంటున్నారు విషయం తెలిసిన వారు.