సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ స్టార్ క్రేజ్ ఉండగానే పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లాడిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. అయితే సినిమాల్లో పెళ్లైనా సరే గ్లామర్ పండించాల్సి ఉంటుంది. అలా సినిమాల్లో హాట్ గా కనిపిస్తూ వస్తుంది. ఈమధ్య ఈ పెళ్లైన హీరోయిన్ ఒక హీరోతో క్లోజ్ గా మూవ్ అవుతుందని తెలుస్తుంది.
ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు అయితే అది పెద్దగా ఆడకపోయినా ఆ సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారట. హీరోయిన్ భర్త బిజినెస్ మెన్ కావడంతో అతను సరిగా ఊళ్లి ఉండడు. ఈ టైంలో ఆ హీరోయిన్ హీరోకి బాగా దగ్గరవుతుందని తెలుస్తుంది. అయితే హీరో మాత్రం తన లిమిట్స్ లో ఉంటునా హీరోయిన్ మాత్రం కావాలని హీరోకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందట.
అయితే వ్యవహారం ముదరకముందే హీరోయిన్ తో తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నాడట సదరు హీరో. అసలే సినిమాలు హిట్లు ఫ్లాపులతో కెరియర్ కన్ ఫ్యూజన్ లో ఉండగా ఇప్పుడు కొత్తగా హీరోయిన్ తో సమస్యల్లో పడటం ఇష్టం లేదన్నట్టు తెలుస్తుంది. మరి ఈ హీరోయిన్ మ్యాటర్ బిజినెస్ మెన్ భర్తకు తెలిస్తే పరిస్థితి ఎక్కడకు వెళ్తుందో ఏంటో చూడాలి. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఈ హీరోయిన్ మ్యాటర్ హాట్ న్యూస్ గా మారింది.