సూపర్ స్టార్ మహేష్ కేవలం సక్సెస్ లో ఉన్న దర్శకులనే పట్టించుకుంటాడు.. వారికి మాత్రమే అవకాశాలు ఇస్తాడు అంటూ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పూరి కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. అయితే పూరి ఏ ఉద్దేశ్యంతో అన్నా కూడా మహేష్ సినిమా ఛాన్స్ రావట్లేదు అన్న అక్కసు కక్కేశాడు. మహేష్ తో పూరి జనగణమన సినిమా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి మీద నమ్మకం పెట్టలేకపోతున్నాడు మహేష్.
కేవలం మహేష్ ఒక్కడు ఒప్పుకుంటే చాలదు.. మహేష్ సినిమా అంటే బిజినెస్ భారీగా ఉంటుంది. తేడా వస్తే పూరి కన్నా మహేష్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న మహేష్ తన తర్వాత సినిమాను వంశీ పైడిపల్లితో చేస్తాడని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సూపర్ హిట్ అవగా మరోసారి ఈ కాంబోని రిపీట్ చేస్తున్నారు.
అయితే మహేష్ వంశీ పైడిపల్లిని సెలెక్ట్ చేసుకోవడంతో మరోసారి పూరి కామెంట్స్ నిజమే అనేలా ఉన్నాయి. హిట్టు ఇచ్చిన దర్శకులకు తప్ప మహేష్ మిగతా వారికి ఛాన్స్ ఇచ్చేలా కనబట్లేదు. అనీల్ కూడా వరుస సక్సెస్ లతో ఉన్నాడు కాబట్టే సరిలేరు ఛాన్స్ ఇచ్చాడు. మరి మహేష్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అతని కెరియర్ కు ఎలా ఉపయోగపడతాయో చూడాలి.