రేణుదేశాయ్” హీరోయిన్ గా కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే ప్రపంచానికి పరిచయం ఎక్కువగా… చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమెకు పవన్ భార్యగానే ఎక్కువ క్రేజ్ వచ్చిందనేది వాస్తవం. అడపాదడపా టీవీ షోస్ లో కనపడట౦ తన వ్యక్తిగత జీవితం మీద ఏవేవో కామెంట్స్ చేయడం వంటివి ఇన్నాళ్ళుగా మనం చూసాం… ఎన్నికలకు ముందు కూడా ఒక రాజకీయ పార్టీకి అనుకూల ఛానల్ లో ఆమె యాంకర్ గా కనిపించారు. అది పక్కన పెడితే… ఇప్పుడు ఆమె మళ్ళీ వార్తల్లో కనపడుతున్నారు.
గత ఏడాది రెండో పెళ్ళికి సిద్దం కాగా అప్పుడు పవన్ అభిమానులు ఎక్కువగా ఆమెను విమర్శించారు.. అప్పుడు వారిపై పలువురు అసహనం కూడా వ్యక్తం చేసారు. అది అలా ఉంటె ఇప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ జీవితం మీద పరోక్షంగా ఒక సినిమా తీయడానికి సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి… ఆ సినిమాకు ఒక రాజకీయ నాయకుడు పెట్టుబడి కూడా పెట్టేందుకు సిద్దమయ్యారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. కథ నేపధ్యం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి అందిన సమాచారం ఆధారంగా చూస్తే…
ఒక రాజకీయ పార్టీని తనకున్న స్టార్ ఇమేజ్ తో ఒక వ్యక్తి స్థాపిస్తారు. దాదాపు అయిదేళ్ళ పాటు ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటారు… ఇదే సమయంలో ఆయన్ను ఇబ్బంది పెట్టే సంఘటన ఒక హీరోయిన్ ద్వారా వస్తుంది.. అప్పుడు… ఒక టీవీ చర్చా వేదికగా ద్వారా ఆమె వివరాలు, అతని వ్యక్తిగత జీవితం వంటివి వెల్లడిస్తూ ఉంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ మీద రేణుదేశాయ్ వర్క్ చేస్తున్నారని… ఒక మరాఠి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.