పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఇక ఈ సినిమాలో మరొక హీరో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మాటలు అందిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ మీడియాతో ఒక విషయాన్ని తెలియజేశారు. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పై పాట గురించి అడగగా.. దీని గురించి మీరు త్వరలోనే తెలుసుకుంటారని తెలియజేశారు థమన్.పవన్ కళ్యాణ్ ఇదివరకే కొన్ని చిత్రాలలో పాటలు పాడారు. కొద్ది రోజుల కిందట విడుదలైన అత్తారింటికి దారేది చిత్రంలో కూడా కాటమరాయుడా అనే పాట పాడడు, అజ్ఞాతవాసి సినిమాలో కూడా మరొక పాటతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
అయితే భీమ్లా నాయక్ వంటి మాస్ చిత్రాలలో పవన్కళ్యాణ్ పాడితే ఈ సినిమా వేరే లెవెల్ కి పోతుంద అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ మూవీ లో నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్స్ గా నటిస్తున్నారు.