తెలుగు సినిమాల లవర్స్‌కు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా సినిమాలు ఎంజాయ్ చేసే పండగ వచ్చేసింది. ఈ యేడాది గత రెండు మూడు నెలలుగా సాహో, సైరా లాంటి పెద్ద సినిమాలను వదిలేస్తే చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ఎంతో ముఖ్యమైన దీపావళికి రెండు తమిళ సినిమాలే వస్తున్నాయి. కార్తీ ఖైదీ, విజయ్ విజిల్ రిలీజ్ అవుతున్నా ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.
ఇక నవంబర్ నుంచి డిసెంబర్‌లో క్రిస్మస్ సీజన్, సంక్రాంతి సీజన్ నుంచి వాలైంటైన్ డే వరకు ఇలా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సార్లు ఒక్కో డేట్‌కే రెండు మూడు సినిమాలు కూడా ఖర్చీఫ్ వేసుకున్నాయి ఎట్టకేలకు వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామా డిసెంబర్ 13 న తెరపైకి వస్తోంది. నిఖిల్ చాలా కాలం ఆలస్యమైన చిత్రం అర్జున్ సురవరం నవంబర్ 14 న వస్తోంది. ఇక నవంబర్ టు ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ అయ్యే సినిమాల డేట్లు ఇలా ఉన్నాయి.
నవంబర్ 1: మీకు మాత్రమే చెప్తా
నవంబర్ 7: రాజ్ తరుణ్ యొక్క ఇద్దరి లోకం ఒక్కటే
నవంబర్ 14: నిఖిల్ అర్జున్ సురవరం
నవంబర్ 21: సందీప్ కిషన్ యొక్క తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్
నవంబర్ 28: అల్లరి నరేష్ బంగారు బుల్లోడు
డిసెంబర్ 13: వెంకటేష్ – నాగచైతన్య వెంకీ మామ
డిసెంబర్ 20: బాలకృష్ణ రూరల్
డిసెంబర్ 20: సాయి ధరం తేజ్ ప్రతీ రోజు పండగే
డిసెంబర్ 25: శర్వానంద్ – సమంతా 96 రీమేక్
జనవరి 12: మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు
జనవరి 12: అల్లు అర్జున్ అలా వైకుంతపురములో
జనవరి 14: రజనీకాంత్ దర్బార్
జనవరి 24: కళ్యాణ్‌రామ్ ఎంతా మంచివాడవురా
జనవరి 26: రవితేజ డిస్కో రాజా
ఫిబ్రవరి 7: నాని – సుధీర్ బాబు వి
ఫిబ్రవరి 14: నాగ చైతన్య – సాయి పల్లవి చిత్రం
ఫిబ్రవరి 21: నితిన్ భీష్మ