దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. ఈ ఎన్ కౌంటర్ పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాల్లో ఉన్న వారు సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియ జేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు… టాలీవుడ్, బాలీవుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి వారు తమ స్పందన తెలియ జేస్తూ తెలంగాణ పోలీసులకు జై కొడుతున్నారు.
అయితే నిందితుల్లో ఒకరైన కేశవులు భార్య మాత్రం పోలీసుల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చెన్నకేశవులను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న చెన్నకేశవులు భార్య ఎన్‌కౌంటర్ విషయం తెలియగానే విషాదంలో మునిగిపోయింది. తన భర్త నేరం చేసినట్లు నిర్ధారించి తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడం తప్పని ఆమె అంటోంది.
ఇక పోలీసులు తన భర్తను అన్యాయంగా చంపేశారని… చనిపోయిన ఆ ఒక్క అమ్మాయి కోసం నలుగురిని చంపేస్తారా ? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రమాదంలో ఉన్నప్పుడు దిశ చెల్లెలికి ఫోన్ చేసే బదులు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని తెలిపింది. పోలీసులు తనను కూడా చంపేయాలని.. తన భర్త లేని లోకంలో తాను ఉండలేని ఆమె చెపుతోంది.
వారం రోజుల క్రితం తన భర్తను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారని, కనీసం ఆయన్ను కలిసేందుకు కూడా అనుమతించలేదని…. మీ ఆయన ఇంటికి వచ్చేస్తాడులే, ఇప్పుడు కలిసేందుకు ఎందుకు తొందర అంటూ కొందరు నన్ను వారించారని, కానీ ఇప్పుడు ఆయన ప్రాణమే తీశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.