నేను ఈల వేస్తే గోలుకొండ అదిరిపడ్డది అంటున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. తమిళంలో దూసుకు పోతున్న బిగిల్ చిత్రంను తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేయగా అది నైజాం ఏరియాలో దుమ్ములేపుతుంది. ఖైదీ చిత్రానికి ధీటుగా ఈ సినిమా వసూళ్ళూ సాధిస్తూ తన సత్తాను చాటుతున్నాడు విజయ్.
విజయ్ విజిల్ నైజాంలో మొదటి రోజు దూకుడుమీదనే ఉంది. మొదటి రోజున విజిల్ సినిమా దాదాపుగా 64లక్షలు వసూలు చేసింది. సినిమా మంచి పాజిటివ్ టాక్తో ముందుకు సాగుతున్నందున మరిన్ని మంచి వసూళ్ళు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిలిం యూనిట్ టాక్. విజయ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎక్కువగా వసూళు చేసిందని టాక్.
విజయ్ సరసన నయనతార నటించడం సినిమాకు భారీగానే కలిసొచ్చిందనే వార్త సిని వర్గాల్లో వినిపిస్తుంది. విజయ్ నటన, ఏ ఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు భారీ హైప్ను క్రియోట్ చేశాయి. దీనికి తోడు విజయ్కు టాలీవుడ్లో మంచి మార్కెట్ కూడా ఉండటంతో భారీ వసూళ్ళనే సాధిస్తుంది. ఇక ఇది వీకేండ్ కావడంతో మరిన్ని మంచి వసూళ్ళు సాధించనున్నది.