నువ్వు నిజ‌మైన రేపిస్టువి… మాధ‌వీల‌త ఘాటు వ్యాఖ్య‌లు..

Google+ Pinterest LinkedIn Tumblr +

వెటర్నరీ డాక్టర్ దిశాని నలుగురు కామాంధులు అత్యంత క్రూరంగా అఘాయిత్యం చేసి హత్య చేసిన విష‌యం ఇప్పుడు హైద‌రాబాద్ టు ఢిల్లీ పార్ల‌మెంటును ఓ ఊపు ఊపుతోంది. ప్ర‌తి ఒక్క‌రు ఈ దారుణ సంఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. డాక్ట‌ర్ దిశాపై హ‌త్యాచారం చేసిన వాళ్ల‌ను ఉరివేసి చంపేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ముక్త‌కంఠంతో కోరుతున్నారు. ఇదే వ్యవహారం పై నిన్న పార్లమెంట్ కూడా షేక్ అయ్యింది.

ఈ సంఘ‌ట‌న‌పై హీరోయిన్ మాధవీలత కూడా స్పదించింది. దిశా హ‌త్య‌పై మాధ‌వీ సీఎం కేసీఆర్‌ను సోష‌ల్ మీడియాలో నిల‌దీసింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఓ నెటిజ‌న్ నుంచి తీవ్ర‌మైన కామెంట్ ఎదురైంది. మాధ‌వీ కేసీఆర్‌ను ఉద్దేశించి రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌పై ఇలాంటి దారుణ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే మీరు ఎందుకు ? స్పందించ‌డం లేద‌ని కాస్త సీరియ‌స్‌గా ప్ర‌శ్నించింది.

మీ ఇంటి ఆడ‌పిల్ల‌ల‌కు ఇలా జ‌రిగితే ఇలాగే ? రెస్పాండ్ అవుతారా ? అని కూడా ఆమె ప్ర‌శ్నించింది. ఈ కామెంట్‌ను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ ‘ఏందే నీ గోల. నీ లాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు’ అని కామెంట్ చేశాడు. దీనికి మాధ‌వీల‌త కూడా ఘాటుగానే రిప్లే ఇచ్చింది. ” రేపిస్టులు అంటే అలానో ఇలానో ఉంటారు అని టీవీలో చూశాను పేపరల్లో చదివాను.. కానీ రేపిస్టులు అంటే నీలా ఉంటారు అని ఫస్ట్ టైమ్ నా ఫేస్ బుక్ లో చూశాను.. నీ సంస్కారం ఏంటో నీ తల్లిదండ్రలు నిన్ను ఎంత గొప్పగా పెంచారో.. నీ కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది ” అని కామెంట్ చేసింది.

ఇలాంటి వ్య‌క్తులు స‌మాజంలో ఉన్న‌న్ని రోజులు ఆడ‌పిల్ల‌ల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని కూడా ఆమె త‌న కామెంట్‌లో వాపోయింది. ఇక మాధ‌వీల‌త పెట్టిన ఈ ఘాటు కామెంట్‌కు నెటిజ‌న్ల నుంచి భారీగా స‌పోర్ట్ ల‌భిస్తోంది.

Share.