నాగ చైతన్య, సాయి పల్లవి సినిమాకు క్రేజీ టైటిల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ఇయర్ మజిలీతో హిట్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ తో క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ క్రేజీ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి రేసులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన నాగ చైతన్య మరో పక్క శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాపై కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ గా లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఆల్రెడీ సాయి పల్లవితో ఫిదా లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల మరోసారి ఆమెతో సినిమా చేస్తున్నాడు. చైతు, సాయి పల్లవిల జోడీ కూడా సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తుంది.

లవ్ స్టోరీ టైటిల్ చూస్తుంటే శేఖర్ కమ్ముల మళ్లీ మనసులోతుల్లో నిలిచిపోయే ఓ అద్భుతమైన ప్రేమ కథను చెప్పబోతున్నాడని అనిపిస్తుంది. మజిలీతో తన సత్తా చాటిన చైతు లవ్ స్టోరీతో కూడా అదే రేంజ్ హిట్ కొట్టేలా ఉన్నాడు. శేఖర్ కమ్ముల మూవీ కాబట్టి కచ్చితంగా సినిమా పక్కా టార్గెట్ తో వస్తుంది. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి.

Share.