నందమూరి మల్టీ స్టారర్ అభిమానులు కోరుతున్నారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

సిని అభిమానుల్లో మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరు స్టార్ హీరోలు మల్టి స్టార్ సినిమాలు చేస్తున్నారు అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే టాలివుడ్ లో మాత్రం మల్టీ స్టారర్ సినిమాలు పెద్దగా కనపడటం లేదు. ఎక్కడో ఒక సినిమా మినహా ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేష్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన,

గోపాల గోపాల మినహా పెద్దగా ఆకట్టుకునే సినిమాలు రాలేదు. ఇది పక్కన పెడితే… ఇప్పుడు నందమూరి అభిమానుల మనసులో ఒక కోరిక ఉంది. వాళ్ళు ఒక మల్టి స్టారర్ ని కోరుకుంటున్నారట. అదేంటి అంటే… బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ హీరోలు గా… ఎన్టీఆర్ విలన్ గా ఒక సినిమా కావాలని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ పాత్రలో దుమ్ము రేపాడు. కాబట్టి ఆ రేంజ్ లో ఎన్టీఆర్ కి ఒక పాత్ర ఇచ్చి అగ్ర దర్శకుడు ఒకరు ఈ బాధ్యత తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

ప్రస్తుతం మెగా హీరో రాం చరణ్ తో, ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నారు… ఈ సినిమా తర్వాత ఏ సినిమా అనేది ఆయన ఖరారు చేయలేదు. దీనితో అభిమానులు ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేయమని నందమూరి హీరోలను కోరుతున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు ఇప్పుడు హ్యాపీ గా ఉన్నారని, మీరు కూడా కలిసి సినిమాలు చేసి అందరి విమర్శలకు తాళం వెయ్యాలని, స్టార్ అనే హోదాను పక్కన పెట్టి అభిమానుల కోసం ఆలోచించాలని సలహా ఇస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెడితే మంచిది అంటున్నారు.

Share.