త్రివిక్రం బోయపాటిగా మారాడే.. అరవింద ట్రైలర్ పై అరుపులు.. విరుపులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత ట్రైలర్ మంగళవారం సాయంత్రం ఫ్యాన్స్ సమక్షంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఎన్.టి.ఆర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో హీరోయిజం చూపించాడు. అయితే త్రివిక్రం మార్క్ డైలాగులు వినిపించినా త్రివిక్రం ఏంటి సడెన్ గా ఇలా వైలెన్స్ అటెంప్ట్ అందుకున్నాడని ఫ్యాన్స్ డౌట్.

అయితే సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు కాబట్టి ఇలా పెట్టారట. సినిమా మొత్తం రెండున్నర గంటల్లో అర్ధగంట మాత్రమే యాక్షన్ పార్ట్ ఉంటుందని. మిగతా రెండు గంటలు త్రివిక్రం మార్క్ డైలాగులు అదరగొడతాయని అంటున్నారు. ట్రైలర్ చూసిన వారెవరైనా ఇది త్రివిక్రం సినిమానా బోయపాటి సినిమానా అనే డౌట్ రాక మానదు.

మరి ఎవరి స్టైల్ ఎలా ఉన్నా రికార్డుల ఊచకోత కోసేందుకు యంగ్ టైగర్ వచ్చేస్తున్నాడు. దసరా బరిలో అరవింద సమేతగా వస్తున్న ఎన్.టి.ఆర్ బాక్సాఫీస్ పై తన వీర ప్రతాపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Share.