ప్రస్థానం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై వెంటాద్రి ఎక్స్‌ప్రెక్స్ తో బంపర్ హిట్ కొట్టిన కుర్ర హీరో సందీప్‌కిషన్ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా వెనకపడ్డాడు. నినువీడని నీడను నేను సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సందీప్ తాజాగా తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్‌కిషన్ కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతోన్న ఈ సినిమాలో హన్సికా మోత్వాని హీరోయిన్ కాగా వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించింది.
కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన జి.నాగేశ్వర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కమెడియన్లు వెన్నెల కిషోర్, సప్తగిరి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గురువారం రాత్రే హైదరాబాద్, తెనాలి, గుంటూరు, కర్నూలు, రాజమండ్రిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. విడుదలైన అన్ని చోట్లు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్లు చూసిన వారు అయితే కడుపుబ్బా నవ్వించే సినిమా అని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
సినిమా అంతా కమెడీ జనరేట్ అయినా కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు పడ్డాయని టాక్. సందీప్ కిషన్ తన నటనతో సినిమాను నడిపించాడు. ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను బేస్ చేసుకుని అల్లుకున్న సీన్లు బాగా పేలాయట. కేఏ పాల్ పాడిన పాట, కోడి కత్తి, గ్రామ వలంటీర్ల సీన్లు బాగున్నాయంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకు మేజర్ హైలెట్ అట.
ఓవరాల్‌గా కామెడీ బాగున్నా తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. అందరూ బాగానే నటించినా.. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మూవీలో కొత్తగా ఏమీ చూపించలేదని ప్రేక్షకులు అంటున్నారు. మరి పూర్తి రివ్యూతో ఈ సినిమా సత్తా ఏంటో ? తేలిపోనుంది.