‘ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్…

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో సందీప్ కిష‌న్ కొద్ది రోజులుగా వ‌రుస ప్లాపుల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. నినువీడ‌ని నీడ‌నునేనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తెనాలి రామ‌కృష్ణ సినిమా అంచ‌నాలు అందుకోలేక బొక్క బోర్లా ప‌డింది. చాలా రోజుల తర్వాత కంప్లీట్ కమర్షియల్ హిట్ కొట్టాలని కేవలం నవ్వించి ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టాలని యంగ్ హీరో సందీప్ కిషన్ చేసిన ఈ ప్ర‌య‌త్నం స‌క్సెస్ కాలేదు.

కామెడీ సినిమా స్పెష‌లిస్ట్‌గా పేరున్న‌ జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క‌లెక్ష‌న్లు టాక్‌కు త‌గిన‌ట్టుగా నిరుత్సాహ ప‌రుస్తున్నాయి. తొలి రోజు నుంచే వ‌రుస‌గా తెనాలి రామ‌కృష్ణ క‌లెక్ష‌న్లు డ్రాప్ అవుతున్నాయి. తొలి రోజుతో పోలిస్తే రెండవ రోజు డ్రాప్స్ అవ్వ‌గా… మూడో రోజు మ‌రింత‌గా డ‌ల్ అయ్యాయి.

ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో 1.53 కొర్ల షేర్ రాబ‌ట్టిన రామ‌కృష్ణుడు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 1.59 కోట్ల షేర్ సాధించాడు. ఏపీ, తెలంగాణ‌లో రు 4.7 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 1.5 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డంతో పాటు పూర్తిగా డ్రాప్ అవ్వ‌డంతో రివ‌క‌రీ క‌ష్టంగానే ఉంది. ఈ వీకెండ్‌లో మ‌రో నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాతో సందీప్ ట్రేడ్ బొక్క పెట్టేయ‌నున్నాడు.

‘ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ’ ఏరియా వైజ్ 3 డేస్ క‌లెక్ష‌న్స్ :

నైజాం – 58.2 లక్షలు

సీడెడ్ – 17.2 లక్షలు

గుంటూరు – 11.2 లక్షలు

ఉత్తరాంధ్ర – 20.2 లక్షలు

తూర్పు గోదావరి – 13.7 లక్షలు

పశ్చిమ గోదావరి – 10.2 లక్షలు

కృష్ణా – 15.1 లక్షలు

నెల్లూరు – 7.3 లక్షలు
—————————————————
మూడు రోజుల మొత్తం షేర్ – 1.53 కోట్లు
—————————————————

3 డేస్ ఇండియా + ఓవర్సీస్ – 7 లక్షలు

———————————————–
వరల్డ్ వైడ్ 3 డేస్ టోటల్ – 1.59 కోట్లు
———————————————–

Share.