వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కొడుకు.. వరుస ప్లాప్లతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు తండ్రి.. అయితే తండ్రి కొడుకులతో ఓ క్రేజీ ప్రాజెక్టును రూపొందించాలని అనుకుని సిద్దమైన ఓ దర్శకుడు మాత్రం తండ్రి కొడుకుల వ్యవహరంతో నలిగిపోతున్నాడు.. ఇప్పుడు ఈ ఇద్దరు డేట్స్ ఇచ్చేది ఎన్నడో.. ఆ సినిమా ముందుకు కదిలేదెన్నడో.. ఆ దర్శకుడి కోరిక తీరేదెన్నడో.. ఇంతకు ఈ తండ్రి ఎవరు.. కొడుకు ఎవరు.. మద్యలో నలుగుతున్న దర్శకుడు ఎవరు అనేదే కదా మీ డౌట్..
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్యల నడుమ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నలిగిపోతున్నాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తుంది. అయితే అక్కినేని నాగార్జున వరుస ప్లాప్లతో వెనుకపట్టు పట్టాడు.. అదే కొడుకు నాగచైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.. ఇప్పుడు ఇద్దరితో కలిసి తెరకెక్కించాలనుకున్న సినిమా బంగార్రాజు.
బంగార్రాజు సినిమాలో తండ్రికొడుకులు కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాలో నటించబోతున్నారు. అయితే ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం బంగార్రాజు సినిమా. అయితే ఈసినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్దమైన దర్శకుడు కళ్యాణ్కృష్ణ ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుని రెడిగా ఉన్నాడు. అయితే తండ్రి డేట్స్ కుదిరితే కొడుకు డేట్స్ దొరకడం లేదట.. కొడుకు డేట్స్ కుదిరితే తండ్రి డేట్స్ కుదరడం లేదట.. దీంతో సినిమా ముందుకు సాగడం లేదనే టాక్ వినిపిస్తుంది. సో ఇద్దరి డేట్స్ కుదర దర్శకుడు కళ్యాణ్కృష్ణ ఖాళీగా కూర్చున్నాడట..