టాలీవుడ్ అంటేనే హీరోయిన్లు, నిర్మాత‌ల‌కు భ‌యం ప‌ట్టుకుందా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణాలో ఇప్పుడు ఐటి దాడుల సందడి నెలకొంది. అవును ఒకరకంగా చెప్పుకోవాలి అంటే ఇది సందడే… మేఘా కృష్ణా రెడ్డితో మొదలైన ఐటి దాడులు… కల్కి ఆశ్రమం వరకు వెళ్ళాయి… వయా… ఎమ్మెల్యేలు, సిని పరిశ్రమ వేదికలు గా ఐటి దాడులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల మీద ఉన్న ఆరోపణలు, సిని పరిశ్రమ మీద కూడా కొంత కాలంగా వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సిని పరిశ్రమ వణికిపోతుంది. ఇటీవల ప్రముఖ నిర్మాతలను, సిని నిర్మాణ సంస్థల మీద ఐటి దాడులు చేసిన సంగతి తెలిసిందే.

ఆసియన్ సినిమాస్ మీద ఐటి దాడులు జరిగాయి. ఆ తర్వాత… దిల్ రాజు సహా కొందఱు నిర్మాతలను టార్గెట్ చేసి ఐటి శాఖ దాడులు చేసింది. ఇటీవల ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, హీరో నాని ఇళ్ళల్లో ఐటి శాఖ సోదాలు చేసింది. ఇక మహేష్ బాబు మీద కూడా సోదాలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. దీనితో ఇప్పుడు టాలివుడ్ లో చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు, చిన్న హీరో నుంచి అగ్ర హీరో వరకు కూడా ఐటి దాడుల దెబ్బకు భయపడిపోతున్నారు.

హైదరాబాద్ లో స్థిరపడిన కొందరు హీరోయిన్లు ఐటి శాఖ దాడులతో జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల సినిమాలు హిట్ అయిన హీరోలు అయితే ఐటి దాడుల దెబ్బకు సినిమాలను ప్రమోట్ చెయ్యాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. కొందరు నిర్మాతలు అయితే అగ్ర హీరోలతో సినిమాలు చెయ్యాలి అంటేనే భయపడుతున్నారు. ఇక రాజకీయ నాయకులకు మద్దతు గా పోస్టులు పెట్టె వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. త్వరలోనే మరికొందరిని లక్ష్యంగా చేసుకుని ఐటి శాఖ కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కూడా ప్రచార౦ జరుగుతుంది.

Share.