చిరంజీవి.. కొరటాల శివ కథ.. టెన్షన్ లో చిరు..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. రైటర్ గా దర్శకుడిగా వరుస సూపర్ హిట్లు కొడుతున్న కొరటాల శివ చిరంజీవితో సినిమా అనేసరికి ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షస్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ నిర్మిస్తున్నారు. తన ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక పాయింట్ చెప్పే కొరటాల శివ చిరు సినిమాకు కూడా ఓ కొత్త పాయింట్ రాసుకున్నాడట.

ఈ సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవకతవకల గురించి ఉంటుందట. చిరు ఇందులో దేవదాయ శాఖా ఉద్యోగిగా కనిపిస్తారట. పొలిటిషియన్స్ ఎలా దేవాదాయ భూములను కబ్జా చేస్తారో ప్రస్తావించి వాటిని వారి నుండి కాపాడే పాత్రలో చిరు కనిపిస్తాడట. మొత్తానికి కొరటాల శివ మరోసారి ఓ సూపర్ స్టోరీతో వస్తున్నాడని చెప్పొచ్చు. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తాడని అంటున్నారు.

అయితే దానికి సంబందించిన కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. అటు నిర్మాతగా.. హీరోగా రాం చరణ్ డ్యుయల్ రోల్ పోశిస్తున్నాడు. కొరటాల శివ సినిమాలో చిరుతో చరణ్ నటిస్తే మాత్రం ఈ సినిమా కూడా మరో సంచలనంగా మారుతుంది.

Share.