చాలామందితో డేటింగ్ చేశా.. ఆ కోరిక మాత్రం ఎవరు తీర్చలేదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గోవా బ్యూటీ ఇలియానా అంటే తెలుగులో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు పూర్తిగా ఫేడవుట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసినా సరే లక్ కలిసి రాలేదు. కొన్నాళ్లుగా ఆండ్రూతో డేటింగ్ లో ఉంటూ అతనితో ముద్దు ముచ్చట్లు జరిపిన ఇలియానా ప్రస్తుతం తన స్టేటస్ సింగిల్ అనే చెబుతుంది. ఆండ్రూతో వ్యవహారం పెళ్లి దాకా వెళ్లిందని వచ్చిన వార్తలన్ని ఫేక్ అని తెలుస్తుంది.

ఇదిలాఉంటే ఈమధ్య తన ఫోటో షూట్స్ తో మళ్లీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇల్లి బేబ్. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన డేటింగ్ విషయాలను పంచుకుంది. కేవలం ఆండ్రూతోనే కాదు చాలామందితో డేట్ చేశా అని చెప్పుకొచ్చింది ఇలియానా. అయితే డేటింగ్ కు వెళ్లినా సరే తన కోరిక మాత్రం ఎవరు తీర్చలేదని చెబుతుంది.

తనకు నచ్చిన వ్యక్తులు తనకు బొకే ఇస్తే తనకు చాలా ఇష్టమని. అయితే తనని డేట్ కు తీసుకు వెళ్లినా సరే ఎవరు తనకు బొకేలు ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఇలియానా మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టనుందని తెలుస్తుంది. తెలుగు, తమిళంలో మంచి పాపులారిటీ ఉన్న టైంలో బాలీవుడ్ ఛాన్స్ రాగానే అక్కడకు వెళ్లిన ఇలియానా.. అక్కడ ఎలాగు అవకాశాలు రావని తెలిసి మళ్లీ తెలుగు, తమిళ సినిమాల మీద ఆశలు పెట్టుకుంది.

Share.