నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రివ్యూయర్ల నుండి.. క్రిటిక్స్ నుండి యావరేజ్ మార్కులే వచ్చాయి. అటు అమెరికాతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశించిన రేంజ్‌లో కలెక్షన్లు రాలేదు. ఓవర్సీస్ వసూళ్లు చూస్తే గురువారం ప్రీమియర్లు.. శుక్రవారం కలిసి టోటల్ గా $350K కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో ప్రీమియర్ కలెక్షన్స్ లెక్క $185K. ఈ కలెక్షన్స్ నాని సినిమాకు డీసెంట్ అనే చెప్పాలి.
నాని గత చిత్రం జెర్సీ కలెక్షన్స్ తో పోలిస్తే మాత్రం ఇవి తక్కువే. ఎందుకంటే జెర్సీ ప్రీమియర్స్ + మొదటి రోజు కలెక్షన్స్ $ 410K. అంటే క్లాస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న జెర్సీ సినిమా కంటే గ్యాంగ్ లీడర్‌కు ఆశించిన రేంజ్ వసూళ్లు రాలేదు. నాని గత మూడు సినిమాల వసూళ్లు తగ్గుతున్నాయి. దేవదాస్, కృష్ణార్జున యుద్ధం ప్లాప్ అయ్యాయి.
జెర్సీ కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. సినిమా సినిమాకు నాని మార్కెట్ బాగా డౌన్ అవుతోంది. ఇక గ్యాంగ్ లీడర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రు. 4.51 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఎప్పుడో మూడేళ్ల క్రితమే నాని సినిమాకు తొలి రోజు రూ.8 కోట్ల షేర్ వచ్చేది. ఏదేమైనా నాని మార్కెట్ రోజు రోజుకు డౌన్ అవుతోందన్నది మాత్రం స్పష్టం. కథలు మరీ కొత్తగా లేకపోవడం, నాని నటనలో మొనాటనీ కనిపించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.