తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉన్న కార్తీ కంప్లీట్ గా లుక్ మార్చి ఓ డిఫరెంట్ కథనంతో నటించిన సినిమా ఖైదీ. దీపావళి కానుకగా మరో క్రేజీ హీరో విజయ్ నటించిన బిగిల్ (తెలుగులో విజయ్) సినిమాకు పోటీగా వచ్చిన ఖైదీ అదిరిపోయే సూపర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.
మొదటి రోజు మార్నింగ్ షో తరువాత సూపర్ హిట్ టాక్ తో పికప్ అయిన కలెక్షన్స్ 6వ రోజుకి కూడా డ్రాప్ కాకూండా దూసుకుపోతున్నాయి.
విచిత్రం ఏంటంటే తొలి రెండు రోజులు స్టాండర్డ్‌గా జోరుమీదున్న విజిల్ రోజు రోజుకు బాక్సాఫీస్ దగ్గర డౌన్ అవుతుంటే.. ఇటు ఖైదీ రెండో రోజు నుంచి బాగా పికప్ అవుతూ ఆరో రోజు కూడా అదే స్టాండర్డ్స్‌లో వసూళ్లు రాబడుతోంది. మౌత్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండడం వల్ల ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి.
ఇక ఖైదీ 6 రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.43 కోట్ల షేర్ తో ప్రాఫిట్ జోన్ కి చాలా దగ్గరైంది. ఆంధ్ర – తెలంగాణలో సుమారు 4.5 కోట్లకి ఈ సినిమాని కొనుగోలు చేశారు. ఈ రోజు నుంచి ఖైదీ లాభాలను తెచ్చిపెట్టనుంది.
ఏరియాల వారీగా ‘ ఖైదీ ’ 6 రోజుల కలెక్షన్స్ :
నైజాం – 1.76 కోట్లు
సీడెడ్ – 74.1 లక్షలు
గుంటూరు – 28.3 లక్షలు
ఉత్తరాంధ్ర – 49.2 లక్షలు
తూర్పు గోదావరి – 35.6 లక్షలు
పశ్చిమ గోదావరి – 24.5 లక్షలు
కృష్ణా – 36.1 లక్షలు
నెల్లూరు – 19.9 లక్షలు
—————————————-
6 డేస్ మొత్తం షేర్ – 4.43 కోట్లు
—————————————-