క్రికెటర్‌తో ప్రేమలో పడటం ఆ హీరోయిన్‌కి కలిసి రాలేదా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రికెటర్లకు హీరోయిన్లకు మధ్య లవ్ స్టోరీస్ నడవడం అనేది ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం… అటు బాలివుడ్ లో, తమిళంలో కూడా క్రికెటర్లతో ఎక్కువగా ప్రేమలో పడుతూ ఉంటారు హీరోయిన్లు, తెలుగులో కూడా అడపాదడపా ఆ కథలు మనం వింటూనే ఉంటాం… ఒకవేళ వాళ్ళు ప్రేమలో లేకపోయినా సరే అభిమానులు చెప్పే బొంబాయి కబుర్లు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి… వాళ్ళు ఎక్కడైనా కనపడితే చాలు ప్రేమ అంటూ సోషల్ మీడియా వేదికల మీద వండి వారుస్తూ ఉంటారు అభిమానులు.

ఇది వాళ్ళకు ఇబ్బందిగా ఉన్నా సరే వీళ్ళకు వినోదం ముఖ్యం కాబట్టి ఎంత మాత్రం వెనక్కి తగ్గే ఆలోచన కూడా చేయరు. గత కొంత కాలంగా యువ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి, టీం ఇండియా స్టార్ ఆటగాడు… జస్ప్రిత్ భూమ్రాకి మధ్య… కొంత కాలంగా లవ్ స్టోరీ నడుస్తుందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్నాయి. వాళ్ళు కాదు లేదు… అన్నా సరే వీళ్ళు మాత్రం వెనకడుగు వేయడం లేదు… వాళ్ళు సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు లైక్ కొట్టినా సరే ప్రేమలో మునిగిపోయారు అంటూ రాస్తున్నారు.

తాజాగా అనుమపమకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భూమ్రా తో ఆమె ప్రేమాయణం మొదలుపెటిన తర్వాత ఆమెకు కలిసి రాలేదని అనడం మొదలుపెట్టారు. ఆమెకు ఇప్పుడు సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గాయట… గత ఏడాది ప్రేమలో ఉండి ఆమె సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. ఇప్పుడు ఆమె సినిమాలు చెయ్యాలని చూస్తుందట. కాని ఆమెతో మాట్లాడటానికి దర్శకులు ఆసక్తి చూపించలేదని అంటున్నారు.. తాము వెళ్ళినప్పుడు ఆమె పట్టించుకోలేదని ఇప్పుడు సినిమాలు చేస్తాను అని అడగడం ఆమె ఇష్టమేనా అంటూ పెదవి విరుస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

Share.