ఈ రోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతం లో కోల్ కతా లోని ఆలీపోర్ ప్రాంతంలో మజర్‌హట్ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. తాజా సమాచారం ప్రకారం 5 మంది వంతెన కింద చిక్కుకుని చనిపోయారని వెల్లడించారు మీడియా వర్గాలు, సుమారు 6 మంది గాయపడగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇక కొద్దీ సేపటి క్రితమే పొలిసు సిబ్బంది మరియు కేంద్ర రక్షణ బలగాలు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని సహాయ చర్యలు ముమ్మరం చేసారు. కోల్‌కతాలోని నగరం లో అత్యంత పురాతన వంతెనల్లో ఇది కూడా ఒకటి కావటం విశేషం. ఈ అనుకోని ఘటనలో ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఎంతనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.