నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. కెఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమాకు సంబందించిన ముహూర్త కార్యక్రమాలు జరిగాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని చూస్తున్నారట. మహానటి సినిమాతో సత్తా చాటిన కీర్తి సురేష్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ కీర్తి సురేష్ ను రిఫర్ చేసినట్టు తెలుస్తుంది.
ఆమె అందం అభినయం మెచ్చిన బాలయ్య పిలిచి మరి ఛాన్స్ ఇస్తున్నాడట. అయితే బాలయ్య ఇచ్చాడు సరే కీర్తి సురేష్ ఆ ఆఫర్ ను యాక్సెప్ట్ చేయాలిగా.. సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా చేస్తే కెరియర్ రిస్క్ లో పడుతుందని భావిస్తారు హీరోయిన్స్ అందుకే వాళ్ళ సినిమా ఛాన్స్ వచ్చినా సైడ్ అవుతారు. కాజల్, తమన్నాల కెరియర్ దాదాపు చివరి దశలో ఉంది కాబట్టి వారు చేయక తప్పట్లేదు. మరి కీర్తి సురేష్ బాలకృష్ణ సినిమా ఆఫర్ ఒకే చేస్తుందా లేదా అన్నది చూడాలి.