ఈ రోజుల్లో సినిమాలో హీరోయిన్ నటించాలి అంటే.. ఆమె కచ్చితంగా స్కిన్ షో చెయ్యాల్సిందే. ఎక్స్ పోజింగ్ అనేది తప్పని సరి… దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐటెం సాంగ్స్, కొంచెం హాట్ సీన్స్ అంటూ అభిమానులు తెర మీద దేని కోసం ఎదురు చూస్తున్నారో ? దాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు దర్శకులు… చాలా మంది హీరోయిన్లు కూడా దీనికి నచ్చే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అందుకోసం భారీగా వసూలు కూడా చేస్తున్నారు. ఎక్కడో ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రం అందుకు అంగీకరించడం లేదు…
ఇక వారిని దర్శకులు కనీసం లిస్టు లోకి కూడా తీసుకోవడం లేదు. ఈ జాబితాలోకి మలయాళ హీరోయిన్ కీర్తి సురేష్ వస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు ఆమె చేసిన ప్రతీ సినిమాలో కూడా ఎక్కడా స్కిన్ షో లేదు. వేసుకుంటే పంజాబీ డ్రెస్ లేదా టాప్, లేదా చీర, లంగా ఒణి మినహా ఆ హీరోయిన్ ఎక్కడా షో చెయ్యడం లేదు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ఆమె నటిగా తనను తాను నిరూపించుకుంది.
అయితే కాస్తో కూస్తో స్కిన్ షో చెయ్యాలని ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత ఆమెను సంప్రదించాడు. దీనికి ఆమె మొహం మీదే నో చెప్పెసినట్టు సమాచారం. ఒక అగ్ర హీరోతో సినిమా ఛాన్స్ ని కూడా ఆమె వదులుకుంది అని స్కిన్ షో చేయడానికి మాత్రం ఇష్టపడటం లేదని అంటున్నారు. ఎక్కువ వద్దని కాస్త అభిమానులను సంతృప్తి పరచడానికి అంటూ నచ్చజెప్పినా ఆమె మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలుస్తుంది.
తనకు తగ్గ పాత్రలు తమిళంలో, మలయాళంలో చాలానే ఉన్నాయని అవసరం అయితే అక్కడ చేసుకుంటాను గాని… ఇలాంటి ఆఫర్లు ఉంటే ఎంత మార్కెట్ ఉన్నా తెలుగులో సినిమాలు మాత్రం చేయను అని స్పష్టం చేసిందట కీర్తి. తన అభిమానులు తనను ఆ విధంగా కోరుకోవడం లేదని చెప్పిందట.