సినీనటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. దీనిపై ఎవరికి వారు రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. కొన్ని ఛానెల్స్, సైట్లలో హీరో రాజశేఖర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజశేఖర్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కారు టైరు పగిలి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టడంతో రాజశేఖర్ కు గాయాలయ్యాయని.. కారు స్పీడ్‌తో వస్తోందని చెపుతున్నారు.
అయితే ఈ ప్రమాదంపై రాజశేఖర్ స్వయంగా వివరణ ఇచ్చాడు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైందని ఆయన చెప్పారు. ఇక ప్రమదం జరిగినప్పుడు కారులో తాను ఒక్కడినే ఉన్నానని.. ఎదురుగా వస్తోన్న కారులో ఉన్న వారు ఆగి లోపల ఉన్నది తానే అని గుర్తుపట్టి విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు.
అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చానన్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే నన్ను కాపాడిన వారి కారులోనే ఇంటికి బయలు దేరి వెళ్లానని… జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు.