కమ్మని రాజ్యంలో బాలయ్య కి స్పెషల్ గిఫ్ట్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలనాల రామ్‌గోపాల్‌వ‌ర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతోంది. ఈ ట్రైలర్ పై అటు సినిమా వర్గాలతో పాటు… ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. ఈ సినిమా ట్రైలర్ తోనే వర్మ తానుఏం చెప్పాలనుకుంటున్నానో ? ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నానో స్పష్టంగా చూపించేసాడు. ఏపీ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా కీలకమైన వ్యక్తులంతా ఉన్నారు. కానీ ట్రయిలర్ లో ఓ వ్యక్తికి మాత్రం చోటు దక్కలేదు. అతడే నందమూరి బాలకృష్ణ.

చివ‌ర‌కు కేఏ.పాల్‌, నారా బ్రాహ్మ‌ణి లాంటి వాళ్ల‌కు కూడా చోటు ఇచ్చిన వ‌ర్ బాల‌య్య‌ను ఎందుకు వ‌దిలేశాడో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. బాలయ్య పాత్రపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. అయితే ట్రైలర్ లో మాత్రం చూపించలేదు అంటున్నారు. మలి విడతలో భాగంగా బాలయ్య పాత్రను హైలెట్‌ చేస్తూ చిన్న వీడియో టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది.

అంటే బాలయ్యకు వర్మ చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. గతంలో బాలయ్య చెప్పగా “మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు” అనే డైలాగ్ ను కూడా బాలయ్య పాత్రతో చెప్పించాడట వర్మ. ఇప్ప‌టికే ట్రైల‌ర్లో అన్ని పాత్ర‌ల‌ను చూపించేసిన వ‌ర్మ ఇప్పుడు బాల‌య్య‌ పాత్ర‌కు సంబంధించి ఒక‌ వీడియో రిలీజ్ చేసి సినిమాకు మ‌రింత హైప్ తేవాల‌ని చూస్తున్నాడ‌ట. ఏదేమైనా క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు సినిమా రిలీజ్‌కు ముందు కావాల్సిన‌న్ని సంచ‌ల‌నాల‌తో హైప్ తెచ్చుకుంది. అయితే వ‌ర్మ సినిమాలను రిలీజ్‌కు ముందు హైప్ చూసి న‌మ్మ‌లేం.. అది వేరే విష‌యం అనుకోండి.

Share.