ఈ రోజుల్లో రాజకీయ నాయకులు నిర్మాతలుగా మారుతున్నారు. తమకు పలుకుబడి ఎక్కువగా ఉండటంతో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు సినిమా మార్కెట్ పెరగడం లాభాలు ఎక్కువగా ఉండటంతో నిర్మాతలుగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తమకు ఉన్న పరిచయాలతో తెలుగు రాష్ట్రాల్లో కొందరు నాయకులు నిర్మాతల అవతారం ఎత్తి విజయాలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. మరి కొందరు ఆ బాటలో ఉన్నారు.
అయితే వాళ్ళతో సినిమాలు చెయ్యడానికి హీరోయిన్లు భయపడిపోతున్నారట. డబ్బులు వస్తున్నా సరే ఏదైనా తేడా వస్తే రాజకీయ విమర్శల్లో వాళ్ళు భాగం అయిపోతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎమ్మెల్యే విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో పదేళ్ళ క్రితం విడుదల అయిన ఒక సినిమాలో నటించిన హీరోయిన్ తో ఆ ఎమ్మెల్యే గారికి బ్లూ ఫిలిం ఉందని… ఒక వీడియోని విడుదల చేసారు. ఆ వీడియో పెద్ద దుమారమే రేపింది.
దీనిని దృష్టిలో పెట్టుకున్న హీరోయిన్లు… అవకాశాలు ఈ రోజు కాకపోతే, రేపు వస్తాయి… అంతే గాని ఇలాంటి ఆరోపణల్లో ఉంటే తమ పరువు పోతుందని, తమ కెరీర్ మీద కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని హీరోయిన్లలో కలవరం మొదలయింది. కొందరు సీనియర్ హీరోయిన్లు అయితే నిర్మాత ఎవరు… ఆయనకు పెట్టుబడి ఎవరు అందిస్తున్నారు అనే వివరాలు తెలుసుకున్న తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. రాజకీయ నాయకులు ఉంటే తాము సినిమా చేసేది లేదని స్పష్టంగా చెప్తున్నారట. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అని తమ జీవితాలను అల్లరి చేసుకోలేమని అంటున్నారట.