ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన టాలీవుడ్ హీరో… ఇప్పుడు కంగారు పడుతున్నాడా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాల మీద రాజకీయ నాయకులు ఆసక్తి చూపించినట్టే, రాజకీయాల మీద కూడా సినిమా రంగం దృష్టి సారిస్తుంది. వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం రాజకీయ నాయకులతో సిని పరిశ్రమలో ఉండే వారు ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. రాజకీయ నాయకులతో కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. బంధుత్వాలను ఉపయోగించి పెట్టుబడులు కూడా వ్యాపారాల్లో పెడుతున్నారు సిని రంగం పెద్ద మనుషులు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకి ప్రముఖ నిర్మాతతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు.

ఇక ఒక హీరో గారి వ్యవహారం ఇటీవల అయటకు వచ్చింది. సదరు హీరో గారు తెలంగాణా ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు హీరో గారు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇటీవల నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టిన ఆయన ఒక ఎంపీ గారికి ఆర్ధిక సహాయం చేసారు. తెలంగాణా ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఆయన అండగా నిలిచారని సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన ఒక నేతకు అన్ని తానై రాజకీయంగా సహాయం చేసారట. అయితే ఇప్పుడు సదరు హీరో గారికి భయం పట్టుకుంది.

పెట్టుబడులు పెట్టిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాలేదు, దానికి తోడు వాళ్ళ ఎన్నికల ఖర్చుకి సంబంధిన ఫిర్యాదులు కూడా ఐటి రంగానికి అందాయి. ఇక సదరు హీరో గారికి ప్రభుత్వం నుంచి కొన్ని లాభాలు కూడా జరిగాయని సమాచారం. ఇప్పుడు ఆయనలో భయం మొదలయింది. ఐటి అధికారులు తనను టార్గెట్ చేస్తారు అనే ప్రచారం జరగడంతో హీరో గారు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారట. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఇక తన నిర్మాణ సంస్థ వ్యాపారాలను కూడా కాస్త తగ్గించే యోచనలో ఉన్నారట.

Share.