ఎన్టీఆర్ త‌ర్వాతే నాకు ఎవ‌రైనా అంటోన్న స‌మంత‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత ఇటీవల ఓ బేబీ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఈ యేడాది ఇప్ప‌టికే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో న‌టించిన మ‌జిలీ సినిమా త‌ర్వాత వెంట‌నే ఓ బేబీ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా అమ్మ‌డు త‌న అందంతో అంద‌రిని త‌న వైపున‌కు తిప్పేసుకుంటోంది. గ‌త పదేళ్లుగా ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఆమె టాలీవుడ్ స్టార్ హీరోల‌తో చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అందుకే సమంతను లక్కీ హీరోయిన్ గా పిలుస్తారందరూ.

ఇక ప్రస్తుతం స‌మంత‌ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 96 మూవీలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఆమె మ‌రో కొత్త సినిమాకు సైన్ చేయ‌లేదు. అయితే ఓ వెబ్ సీరిస్‌లో న‌టించే ఛాన్స్ ఉంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే స‌మంత తాజాగా ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ స‌మంత విష‌యంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

మంచు లక్ష్మీ హోస్ట్ గా నిర్వహిస్తున్న లేటెస్ట్ టాక్ షో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షోలో పాల్గొన్న సమంత పెర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే మీరు న‌టించిన హీరోల‌లో ఎవ‌రు ? బెస్ట్ డ్యాన్స‌ర్ అని ప్ర‌శ్నిస్తే ఆమె వెంట‌నే ఇంకెవ‌రు ఎన్టీఆరే అని చెప్పేసింది.

తాను హీరోగా చేసిన వాళ్ల‌లో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్స‌ర్ అని చెప్ప‌డంతో పాటు ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పింది. ఎన్టీఆర్ సెట్స్‌లో ఎలాంటి రిహ‌ర్స‌ల్స్ లేకుండా డ్యాన్స్ చేస్తాడ‌ని చెప్పింది.
ఇక వీరిద్ద‌రు క‌లిసి బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు.

Share.