భారత దేశంలో వ్యాపారం చేస్తామని వచ్చి తర్వాత దేశాన్ని ఆక్రమించి నియంతృత్వ పాటన చేస్తున్న బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ.. స్యాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్ చేసి వాటిని నాశనం చేశారని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు.
ఆ సమయంలో రామ్ చరణ్ తమకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పినా..ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందకపోగా తమపై దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ‘సైరా’ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈ వివాదంపై రామ్ చరణ్ స్పందించారు. ఈ మూవీ తీసే ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులను కలిశానని అన్నారు. అయితే వందేళ్లు దాటిన ఓ చరిత్ర కారుడి జీవిత కథ ఆవిష్కరించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని కోర్టు పేర్కొందని తెలిపారు.
చరిత్ర పుటల్లో కనుమరుగవుతున్న ఓ చరిత్ర కారుడి జీవిత కథ వెలుగు లోకి తీసుకురావడానిమే మా ప్రయత్నం అన్నారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుడిని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడమనేది తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఒకవేళ సహాయం చేయాల్సి వస్తే..ఉయ్యాలవాడ అనే ఊరి కోసం చేస్తానని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు కౌంటర్ ఇచ్చారు.