ఈ అమ్మడు ఉంటే లిప్ లాక్ ఉండాల్సిందేనా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి సినిమాలో అదరగొట్టిన షాలిని పాండే ఆ సినిమా హిట్టైనా సరే పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. విజయ్ తో పాటుగా సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న అమ్మడు సినిమాల సెలక్షన్స్ బాగాలేక సగటు హీరోయిన్ గా మిగిలిపోయింది. లేటెస్ట్ గా షాలిని పాండే హీరోయిన్ గా యువ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ఇద్దరిలోకం ఒకటే. ఈ నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా క్లీన్ ఎంటర్టైనర్ అవుతుందని అనుకుంటే సడెన్ గా సెన్సార్ వారు ఇచ్చిన యు/ఏ సర్టిఫికెట్ అనుమానాలకు దారి తీస్తుంది. జి.ఎన్.కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో షాలిని పాండే ఘాటు ముద్దులు ఉన్నాయట. ఉన్నది ఒకటి రెండో కాని అది సినిమా మీద ఇంపాక్ట్ పడేలా చేస్తున్నాయట. సినిమా ప్రమోషన్స్ కూడా ఆ ముద్దులను బేస్ చేసుకునే చేస్తారని అంటున్నారు.

ఈ సినిమా సాడ్ ఎండింగ్ ఉంటుందని.. కచ్చితంగా రాజ్ తరుణ్ ఈ మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని అంటున్నారు. షాలిని పాండే కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకుంది. రాజ్ తరుణ్, షాలిని పాండే ఈ ఇద్దరి కెరియర్ కు ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పిచ్చు. మరి అనుకున్న విధంగా రిజల్ట్ వస్తుందో లేదో చూడాలి.

Share.