స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా టీజర్ బుధవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. బన్నీ క్లాస్, మాస్ రెండూ కలగలిపిన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు సహా బన్నీ ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక టీజర్ కూడా వాళ్ల అంచనాలు పెంచేలా ఉంది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులతో పాటు సింపుల్ యాక్షన్ మేడం అంటూ చెప్పే డైలాగ్ అన్నిటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఓ సీన్ లో బన్నీ సుముద్రఖని కారు దిగగానే… అతడి దగ్గరకు వెళ్లి అతడితో కొంత మూతి వంకర పెడుతూ, ‘నువ్వు ఇప్పుడు కారులో నుండి దిగావు, కానీ నేను ఇప్పుడే క్యారెక్టర్ లోని ఎక్కాను’ అనే డైలాగ్ చెప్తాడు.
బన్నీ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు మూతి వంకరగా పెట్టి చేసే యాక్టింగ్ జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ రావణ క్యారెక్టర్‌ను పోలి ఉందని.. ఆ నత్తి క్యారెక్టర్‌ను వెక్కిరించేలా సెటైరికల్‌గా ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బన్నీ, త్రివిక్రమ్ కావాలనే ఎన్టీఆర్‌ను టార్గెట్ గా చేశారని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
అయితే కొందరు ఇది అర్థం లేని వాదన అంటున్నా… మరి కొందరు మాత్రం బన్నీ కావాలనే ఎన్టీఆర్‌పై సెటైర్ వేశాడని అంటున్నారు. మరి దీనిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదేమో ? అనిపిస్తోంది.