అల్లు అర్జున్ తో తట్టుకోవడం కష్టమంటున్న బ్యూటీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో డ్యాన్స్ లో అదరగొట్టే స్టార్స్ ఎవరంటే ఇప్పుడున్న వారిలో ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ రాం చరణ్ అని మాత్రమే చెబుతారు. మెగాస్టార్ తర్వాత ఆ డ్యాన్సింగ్ క్రేజ్ కొనసాగిస్తున్న వీరి ముగ్గురికి ఏ హీరోకి లేని స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా సాంగ్స్ బాగుంటే మాత్రం ఆ సాంగ్స్ కు తగినట్టుగా అదరగొట్టే డ్యాన్స్ లు చేస్తూ అలరిస్తుంటారు. అయితే లేటెస్ట్ గా అల వైకుంఠపురములో అల్లు అర్జున్ డ్యాన్సుల గురించి ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న నివేదా పేతురాజ్ మాట్లాడారు.

స్టార్ హీరో అయ్యుండి కూడా అల్లు అర్జున్ చాలా కష్టపడతారని. ఇక డ్యాన్సుల విషయంలో ఆయన స్పీడుని తట్టుకోవడం కష్టమని.. తనతో పోటీ పడి డ్యాన్స్ చేయాలనుకుంటే కాళ్లు విరుగుతాయని అంటుంది అమ్మడు. స్టార్ హీరోని బాగానే కాకాపడుతుందన్న వార్తలు వస్తున్నా. బన్ని డ్యాన్స్ గురించి ఆమె కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.

మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ ఈ ఇయర్ చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు స్టార్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి బన్ని సినిమాతో అయినా అమ్మడి రేంజ్ మారుతుందేమో చూడాలి.

Share.