స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అయితే ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ కు ముందే వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ అంటూ ఓ ప్రకటన వచ్చింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని అన్నారు. అల వైకుంఠపురములో సినిమా పూర్తి కాగానే ఐకాన్ స్టార్ట్ అవుతుందని అన్నారు. కాని సుకుమార్ ఇచ్చిన టైం కన్నా ముందే స్క్రిప్ట్ రెడీ చేయడం అది బన్నికి నచ్చడంతో ఐకాన్ ను పక్కనపెట్టేశాడట అల్లు అర్జున్. ఐకాన్ సినిమా కథలో కొన్ని డౌట్స్ ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ను దాదాపు క్యాన్సిల్ చేసుకున్నట్టే అంటున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో సినిమాను బన్ని కాదంటాడా అంటే సరైన కథ లేకపోతే ఎంత పెద్ద నిర్మాత అయినా బడ్జెట్ పెట్టగలడేమో కాని సినిమాను ఆడించలేదు. అదీగాక ఆ ఫలితం హీరో ఖాతాలో పడుతుంది. అందుకే ఐకాన్ ను బన్ని వద్దనుకున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.