మెగా నిర్మాత అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులని తెలిసిందే. అల్లు వెంకటేష్ బిజినెస్ చూస్తుండగా.. అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు హీరోలుగా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ రాగా తన కెరియర్ పట్ల ఎలాండి ఆదోళన చెందాల్సిన అవసరం లేదు. అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదిలాఉంటే అల్లు అరవింద్ తన ఆస్తి మొత్తాన్ని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచేశాడని తెలుస్తుంది.
రీసెంట్ గా 70వ పుట్టినరోజు జరుపుకున్న అల్లు అరవింద్ ముగ్గురు కొడుకులకు ఆస్తి వివరాలు అందించి.. వారి వాటా వారికి అప్పచెప్పేశాడట. అల్లు అర్జున్ ఇప్పటికే తన కొత్త ఇంటికి పూజా కార్యక్రమాలు జరిపించాడు. ఇప్పటివరకు ఒకే ఇంట్లో ఉన్న వీరు ఇక మీదట కలిసి ఉండరా అంటే ఏమో చెప్పలేం అని అంటున్నారు.
వెంకటేష్ ఎలాగు ప్రొడక్షన్ కు సంబందించిన పనులు చూసుకుంటే.. బన్ని తన సినిమాలతో తను బిజీ అవదలచుకున్నాడు. ఇక శిరీష్ మాత్రం హీరోగా హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆస్తి పంచినా అందరు కలిసి ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. మొత్తానికి అల్లు అరవింద్ తన పెద్ద బాధ్యతను తీర్చేసుకుని హాయిగా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాడు.