అలాంటి వారికి సమాధానం చెప్పాలనుకుంటున్న మహేష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ అందగాడు.. మంచి నటుడు.. కమర్శియల్ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే అతన్ని సూపర్ స్టార్ ను చేశారు. రాజకుమారుడు నుండి మహర్షి వరకు పాతిక సినిమాల్లో మహేష్ నట ప్రస్తానం గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి సీన్ అయినా సరే ఇలా డైరక్టర్ చెప్పాడో లేడో అలా చేసి చూపించే మహేష్ డ్యాన్స్ విషయంలో మాత్రం నిరాశపరుస్తూ వస్తున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా డ్యాన్స్ విషయంలో ఎదో మమా అనిపించేవారు. కృష్ణ గారి వారసుడిగా మహేష్ డ్యాన్స్ విషయంలో అది బ్రేక్ చేయలేకపోయాడు. బ్రహ్మోత్సవం సినిమా టైంలో మహేష్ డ్యాన్స్ పై ట్రోల్స్ బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత కమర్షియల్ సినిమాలే చేసినా ఆ క్యారక్టర్స్ డెప్త్ ఉండటం వాళ్ళ డ్యాన్స్ చేయడం కుదరలేదు. అయితే ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తన డ్యాన్స్ గురించి కామెంట్స్ చేసిన వారందరికీ సమాధానం చెప్పబోతున్నాడని తెలుస్తుంది.

శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీలో మహేష్ సరిలేరు నీకేవ్వరులో ఒక సాంగ్ ఉందట. ఆ సాంగ్ లో మహేష్ డ్యాన్స్ అదరగొడతాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఫుట్ టాపింగ్ సాంగ్ గా వచ్చే ఈ పాటలో మహేష్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాడట. కచ్చితంగా ఇది మహేష్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్ అని చెప్పొచ్చు.

Share.