గ్లామర్ ఫీల్డ్ లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఎవరం చెప్పలేం. కొందరికి ఐడెంటిటీ వచ్చినా తర్వాత చేసిన సినిమాల వల్ల ఫేడవుట్ అయిపోతారు. కొందరు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తూ సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తారు. అయితే ఇక్కడ వారికి లక్ ఫ్యాక్టర్ అనేది తోడుండాల్సిందే. ఈమధ్య కాలంలో అందం, అభినయం రెండు ఉన్నా సరే లక్ కలిసి రాని అమ్మడు ఉన్నది అంటే అది కేథరిన్ త్రెసా అని చెప్పొచ్చు.
ఇద్దరమ్మాయిలతో సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన కేథరిన్ బన్ని సినిమాల్లో అదపాదడపా కనిపించినా ఆమె కెరియర్ కు అది హెల్ప్ అవ్వలేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న కేథరిన్ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఖాళీ దొరికితే హీరోయిన్స్ ఫోటో షూట్స్ చేయడం కామన్. అలానే కేథరిన్ కూడా లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది.
రెడ్ గౌన్లో రెచ్చ గొట్టే చూపులతో అమ్మడు అందాలు ఆహా అనేలా ఉన్నాయి. సరైన ఛాన్స్ రావాలే కాని తనలోని అసలు టాలెంట్ చూపించేస్తా అంటుంది అమ్మడు. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నా అమ్మడికి కాలం కలిసి రాక అవకాశాలు రావట్లేదు. కేథరిన్ లోని ఈ హాట్ యాంగిల్ ఎవరు గుర్తించలేదా లేదా అన్న డౌట్ వస్తుంది. రానున్న రోజుల్లో అయినా కేథరిన్ మంచి అవకాశాలు అందుకోవాలని ఆశిద్దాం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కేథరిన్ కూడా నటిస్తుంది.