అదే జరిగితే ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు పండుగే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన సినిమాల పంథా మార్చేశాడు. టెంపర్ కన్నా ముందు రెగ్యులర్ సినిమాలతో కెరియర్ లో వెనుకపడిన తారక్ టెంపర్ నుండి వరుస సినిమాలు హిట్లు కొడుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్.. ఆ మూవీ తర్వాత ఎవరితో చేస్తాడన్నది పెద్ద టాస్క్ గా మారింది. అసలైతే అరవింద సమేత కాంబినేషన్ అంటే త్రివిక్రం డైరక్షన్ లో తారక్ సినిమా ఉండొచ్చని అంటున్నారు.

ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ కు ఓ క్రేజీ కథ చెప్పాడట యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాలు చేసిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత తరుణ్ మళ్లీ వెంకటేష్ సినిమా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా గుర్రపు స్వారి నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇదే కాదు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఓ కథ సిద్ధం చేశాడట తరుణ్ భాస్కర్. తారక్ రేంజ్ కు తగినట్టుగా కథ వచ్చిందని.. త్వరలోనే కలిసి కథ చెప్పాలని అంటున్నాడు తరుణ్. ఒకవేళ ఎన్.టి.ఆర్ కు కథ నచ్చితే మాత్రం త్రివిక్రం సినిమా తరుణ్ భాస్కర్ డైరక్షన్ లోనే ఉండొచ్చని అంటున్నారు. మారి తరుణ్ భాస్కర్ తో ఎన్.టి.ఆర్ సినిమా ఊహలకు కూడా అందని ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

Share.