మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా నిర్మించిన సైరా గాంధీజయంతి సందర్భంగా బుధవారం రిలీజ్ అయ్యింది. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన సైరాకు ఒక్కో చోట ఒక్కో స్పందన వచ్చింది. తెలుగులో ఓకే అన్న టాక్ ఉన్నా ఓవరాల్‌గా సూపర్ హిట్ అని మాత్రం ఎవ్వరూ అనడం లేదు. తెలుగులోనూ ముందు బిలో యావరేజ్ టాక్‌తోనే సైరా స్టార్ట్ అయ్యింది.
అయితే ప్రతి ఒక్కరు చిరు నటనపై మరియు దర్శకుడు సురేంధర్ రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే ఇదంతా కేవలం సౌత్ కే పరిమితం. నార్త్ ఇండియాలో సైరా పరిస్థితి దారుణంగా ఉందని తొలి రోజు వసూళ్లే చెపుతున్నాయి. సైరా హిందీ వెర్షన్ కోసం ఏకంగా సల్మాన్, అమీర్ లాంటి వాళ్లతో కూడా ప్రమోషన్లు చేశారు.
అయినా సైరా బాలీవుడ్‌లో మొదటి రోజు కేవలం 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీనిని బట్టి సైరా బాలీవుడ్‌లో డిజాస్టర్ అయినట్టే. తొలి రోజు రు. 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అంటే కనీసం థియేటర్ల రెంట్ కూడా రాని పరిస్థితి. బాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన వార్ చిత్ర విడుదల కూడా సైరా ఈ పరిస్థితి కారణం అని చెప్పొచ్చు.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల చిత్రం కావడంతో పాటు, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా సైరా కు చాలా తక్కువ కేటాయించడం జరిగింది. ఇక వార్ మూవీ దాదాపు 50కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ దిశగా నడుస్తుంది. హాలీవుడ్ మూవీ జోకర్(6కోట్లు) చిత్రం కంటే కూడా సైరా వసూళ్లు తక్కువ కావడం గమనార్హం.