అందం ఒక్కటే కాదు.. అది ఉండాల్సిందే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా తన అంద చందాలతో పాటుగా అభినయంతో ఆకట్టుకుంటున్న భామ కియరా అద్వాని. బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా అదరగొడుతున్న కియరా అద్వాని తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి.

ఇదిలాఉంటే సినిమాల్లో రాణించాలంటే కేవలం అందం ఒక్కటి ఉంటే సరిపోదు ప్రతిభ కూడా కావాల్సిందే అంటుంది కియరా. టాలెంట్ ఉంటేనే ఇక్కడ రాణించగలమని.. అది లేకుండా కేవలం అందం ఒక్కటే ఉన్నా సరిపోదని చెబుతుంది. బాలీవుడ్ లో రీసెంట్ గా కబీర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కియరా అద్వాని సౌత్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన కియరా ఈమధ్య కోలీవుడ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది. పర్ఫెక్ట్ ఫిగర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న కియరా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలగాలని చూస్తుంది. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Share.