సెలబ్రిటీ హోదా వచ్చాక ఎవరేం చేస్తారు.. ఎవరెలా మారుతారు అన్నది ఊహించడం కష్టం. ఇక వారి ప్రవర్తన గురించి ఇన్నర్ టాక్ బయటకు వస్తేనే కాని తెలుసుకోగలం. లేటెస్ట్ గా ఓ స్టార్ హీరోయిన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ గా మారింది. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు హీరోల మధ్య చిచ్చు పెడుతుందని టాక్. ఒక హీరో గురించి మరో హీరో దగ్గర బ్యాడ్ గా చెబుతుందట.
క్రేజీ హీరోయిన్ కాబట్టి స్టార్స్ అందరితో సినిమాలు చేసే ఛాన్సులు అందుకుంటుంది. అయితే అమ్మడు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబుతుందట. అయితే ఆమెకు తెలియకుండా స్టార్ కు కామన్ ఫ్రెండ్ గా ఉండే వాళ్ల ద్వారా ఈ విషయాలు తెలుసుకుని ఆ హీరోయిన్ ను దూరం పెట్టడం మొదలు పెట్టారట. సాధ్యమైనంత వరకు ఆ హీరోయిన్ కు ఛాన్సులు కూడా ఇవ్వట్లేదని టాక్.
హీరో మధ్య చిచ్చు పెట్టిన ఆ హీరోయిన్ గురించి ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. ఒడ్డు పొడుగు బాగున్నా ఈ అమ్మడికి ఇదే పాడు బుద్ధని అంటున్నారు. అసలే హీరోలు సఖ్యతగా ఉంటున్నా ఆ హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. అలాంటిది ఈ అమ్మడు హీరోల మధ్య కూడా దూరం పెంచాలని చూస్తుందట. అయితే ఈ అమ్మడి మాటలను ఒక చెవిన విని మరో చెవిన వదిలేస్తున్నారట ఆ హీరోలు. స్టార్స్ అంతా కలిసినప్పుడు ఈ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటారని తెలుస్తుంది.