హీరోయిన్ వయ్యారాలతోనే సినిమా వ్యాపారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాలో కథానాయిక పాత్ర ఉన్నా లేకున్నా సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నారు. కథ బాగుంటే చాలు మిగతా వన్ని ఎలా ఉన్నా సినిమా హిట్ అవుద్ది. స్టార్ సినిమా అయినా చిన్న బడ్జెట్ సినిమా అయినా సినిమా ఫలితం కేవలం కథ మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే ఈమధ్య కొన్ని సినిమాలు ఆ లెక్క మార్చేస్తున్నాయి. హీరోయిన్ గ్లామర్ తో సినిమాలో మెయిన్ కాన్సెంట్రేషన్ చేస్తున్నారు.

శృంగార ప్రియుల కోసమే ఈ సినిమా అనేట్టుగా వారి ప్రమోషన్స్ ఉంటున్నాయి. ఇక వచ్చిన ఈ ఛాన్స్ వాడుకోవాల్సిందే అంటూ హీరోయిన్స్ కూడా విచ్చల విడిగా అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఆరెక్స్ 100, ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమాలతో పాయల్ రాజ్ పుత్ అందాలనే ప్రధాన ఆకర్షణగా చేస్తూ సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాల్లో కథ కూడా ఉంది. కాని వీటి రిఫరెన్స్ తో కొన్ని సినిమాలు హీరోయిన్ వయ్యరాలతోనే సినిమాను మార్కెట్ చేసుకుంటున్నారు.

లిప్ లాక్స్, అడల్ట్ సీన్స్ ఇవే సినిమాను కాపాడేస్తాయి అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే వాటిని చూసి థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువ. స్మాల్ బడ్జెట్ సినిమాలు బిజినెస్ బాగా జరగాలంటే ఇదో ట్రిక్ గా ఉపయోగిస్తున్నారు. కాస్త అందంగా కనిపించే హీరోయిన్ ను తెచ్చి ఆమె చేత ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చేయించి సినిమాను అమ్మేసుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు బిజినెస్ బాగానే జరిగినా తీసిన దర్శక నిర్మాతలకు, అలాంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ కు నెక్స్ట్ ఛాన్సులు ఉండవు.

Share.