శ్రీముఖిని అంత దారుణంగా మోసం చేసింది ఎవరు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంది. సీజన్ 3లో క్రేజీ కంటెస్టంట్ గా శ్రీముఖి టాప్ ప్లేస్ లో ఉంది. అయితే ఈ వారం ఆమె నామినేషన్స్ లో కూడా ఉంది. ఈ వారం ఐదుగురు నామినేషన్స్ లో ఉండగా ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే గురువారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కంటెస్టంట్ తమ బాధను ఇంటి సభ్యులతో షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలో శ్రీముఖి తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. ప్రాణంగా ప్రేమించిన ఓ వ్యక్తి తనని మోసం చేసి వెళ్లాడని.. ఆ టైంలో తను చచ్చిపోదామని అనుకున్నానని చెప్పింది శ్రీముఖి. తానొక సెలబ్రిటీ కాబట్టి అతని పేరు చెప్పలేనని చెప్పింది. అయితే శ్రీముఖి మనసుని ఇంతగా గాయపరచిన వ్యక్తి ఎవరు అన్న దాని మీద సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

రవి శ్రీముఖి పటాస్ షోలో బాగా పాపులర్ అయ్యారు. వారిద్దరి మధ్య క్లోజ్ నెస్ చూసి శ్రీముఖి చెప్పిన లవర్ రవినే కావొచ్చని అందరు అంటున్నారు. అయితే కొంతమంది ప్రదీప్ ను కూడా శ్రీముఖికి లింక్ పెడుతున్నారు. మనసులో ఇంత బాధ ఉన్నా సరే శ్రీముఖి ఎప్పుడు అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇప్పటివరకు శ్రీముఖి మీద ఉన్న అభిమానం కాస్త ఇంకాస్త పెరిగిందని అంటున్నారు శ్రీముఖి ఫ్యాన్స్.

Share.