రెబల్ స్టార్ విలన్ స్టార్గా ఓకేనా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు స్టార్ విలన్గా ఒకే అయినట్లేనా..? అందుకు ప్రభాస్ తన బాలీవుడ్ ఎంట్రీని ఘనంగా ప్రారంభించబోతున్నారా..? బాలీవుడ్ లో ప్రభాస్కు వస్తున్న వరుస ఆఫర్ల లో ఏ ఒక్క ఆఫర్ను ఒప్పుకున్నా ప్రభాస్ దశ తిరిగినట్లేనా..? ఇప్పుడు ప్రభాస్కు వస్తున్న ఆఫర్లతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో తిరుగులేని హీరోగా మారే ఏకైక హీరోగా డార్లింగ్ మారబోతున్నాడా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రభాస్కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి తిరుగులని ఆఫర్లు వస్తున్నాయి.

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్, తరువాత సాహో చిత్రంతో తన స్టామినా ఏంటో చూపించాడు. అయితే సాహో ప్రాంతీయ భాషల్లో డిజాస్టర్ అయినప్పటికి బాలీవుడ్ బాక్సాఫీసును బద్దలు చేసింది. దీంతో ప్రభాస్కు బాలీవుడ్ లో యమ క్రేజ్ ఏర్పడింది. అందుకే ప్రభాస్ వెంట బాలీవుడ్ నిర్మాతలు పరుగులు పెట్టెందుకు సిద్దమయ్యారు. అందుకే బాలీవుడ్ బాద్షాలు ప్రభాస్తో సినిమా చేసేందుకు వెంట పడుతున్నారు. అందులో ప్రధానంగా కరణ్జోహార్, ఆదిత్య చోప్రా లాంటి బడా నిర్మాతలు ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ను దృష్టిలో పెట్టుకుని రెండు భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ఒప్పించాలని ఈ ఇద్దరు నిర్మాతలు తెగ ఆరాట పడుతున్నారు. అయితే ప్రభాస్కు వస్తున్న ఆఫర్లు మామూలు ఆఫర్లు కాదు. ఒకటి ధూమ్ 4 కాగా, మరొకటి వార్ సీక్వేల్. ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం లో నటించినా ప్రభాస్ పంట పండినట్లే. అయితే ఇక్కడ ధూమ్ 2లో నటిస్తే అది హీరోగా కాకుండా, విలనిజంతో నటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధూమ్ చిత్రం అంటేనే హీరోయిజం కాదు.. విలనిజం.. ఇందులో విలనే హీరో.. అందుకే ప్రభాస్ ధూమ్లో నటిస్తే విలన్గా నటిస్తాడనే టాక్ ఉంది. ఏదేమైనా ప్రభాస్ ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏది ఓకే చెప్పినా బాలీవుడ్లో ప్రభాస్ ఎంట్రీ అయినట్లే.. మరి ప్రభాస్ ఏమంటారో. .ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Share.