రాజ‌మౌళి హ‌ద్దుల్లో తార‌క్‌… హ‌ద్దులు దాటేసిన చ‌రణ్‌..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ తిరిగి స్పీడ్ అందుకుంది. ప్ర‌స్తుతం అల్లూరి సీతారామ‌రాజు రోల్ చేస్తోన్న రామ్‌చ‌ర‌ణ్‌ను బ్రిటీష్ న్యాయ‌స్థానం ముందు హాజ‌రు ప‌రిచే సీన్స్‌ను రాజ‌మౌళి షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ఈషూటింగ్ లో రాజమౌళి చరణ్ కు చిన్న క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు ఒప్పుకున్న‌ప్పుడు చ‌ర‌ణ్‌కు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు రాజ‌మౌళి ఓ కండీష‌న్ పెట్టాడ‌ట‌. ఆ కండీష‌న్ ఇప్పుడు ఎన్టీఆర్ తూచా త‌ప్ప‌కండా పాటిస్తుంటే చ‌ర‌ణ్ మాత్రం మ‌ధ్య‌లో చాలాసార్లు బ్రేక్ చేశాడ‌ని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేముందు మీడియాకు… అదేవిధంగా ఫంక్షన్స్ కు దూరంగా ఉండమని తాను చరణ్, ఎన్టీఆర్‌కు చెప్పిన విష‌యం ఇప్పుడు రాజ‌మౌళి మ‌ళ్లీ గుర్తు చేశాడ‌ట‌.

రాజ‌మౌళికి ఇచ్చిన మాట ప్ర‌కారం ఎన్టీఆర్ బ‌య‌ట ఒక్క ఇంటర్వ్యూ కూడ ఇవ్వలేదు. కానీ చ‌ర‌ణ్ మాత్రం సైరా వంక మీద ప‌లు ఇంట‌ర్వ్యూల్లో పాల్గొన్నాడు. ఇక కొన్ని ప్రైవేటు ఫంక్ష‌న్ల‌కు కూడా అదే గెడ్డం గెట‌ప్‌తో వెళ్లాడు. దీంతో చ‌ర‌ణ్ లుక్ పూర్తిగా రివీల్ అయిన‌ట్టు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇదే రాజ‌మౌళికి న‌చ్చ‌డం లేదంటున్నారు.

ఇక‌పై అయినా కీల‌క సీన్లు షూట్ చేయాల్సి ఉండ‌డంతో బ‌య‌ట లుక్ రివీల్ కానివ్వ‌వ‌ద్ద‌ని జ‌క్క‌న్న చ‌ర‌ణ్‌కు సీరియ‌స్‌గా చెప్పాడ‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే చ‌ర‌ణ్ కొరటాల – చిరంజీవి సినిమాలో కూడా క‌నిపిస్తాడంటున్నారు. మ‌రి రాజ‌మౌళి అప్పుడేం చేస్తాడో ?

Share.