రాజు గారి గది 3 చిత్రం మొదటి రోజు లెక్క తేలింది.. ఈ లెక్క ప్రకారం వారం రోజులు సినిమా ఇలాగే ఆడితే దర్శకుడు ఓంకార్కు ఓ హిట్ దొరికినట్టే.. ఇప్పటికే టాలీవుడ్లో సైరా చిత్రం నెమ్మదించడంతో ఇక రాజు గారి గది 3 సినిమాకు తిరుగుండని పరిస్థితి ఉంది. ఈ సినిమా నిన్న శుక్రవారం విడుదలై… మొదటి రోజున సత్తా చాటిందనే చెప్పవచ్చు..
ప్రముఖ యాంకర్ ఓంకార్ సొంత బ్యానర్ను ఏర్పాటు రాజుగారి గది సిరీస్కు శ్రీకారం చుట్టారు. ఓక్ ఎంటర్టైన్మెంట్ పై ఇప్పుడు సిరీస్ భాగంగా రాజుగారి గది 3 సినిమాను రూపొందించారు. అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో, సినిమాను ప్రీరిలీజ్ బిజినెస్గా రూ.4కోట్లకు అమ్మారు. అయితే మొదటి రోజున ఈ సినిమా అనుకున్న మేరకే వసూలు సాధించి సినిమాపై నమ్మకం పెంచింది.
రాజుగారి గది 3 సినిమా ఫస్ట్హాఫ్ కొంత నెమ్మదించి, ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలిస్తే.. సెకండాఫ్ సినిమాను హస్యంతో నెట్టుకొస్తుంది. అందుకే ప్రేక్షకులు హస్యం కోసమైనా సినిమాను వీక్షించక తప్పదు.. అందుకే సినిమా మొదటి రోజున రూ.1.25కోట్ల వసూళ్ళను రాబట్టింది. అంటే మరో వారం రోజులు ఇలాగే సినిమా ప్రదర్శించబడితే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లే లెక్క.. ఈసినిమాతో పాటుగా విడుదలైన ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కృష్ణారావు సూపర్ మార్కెట్ చిత్రాలు డిజాస్టర్ అయిన నేపథ్యంలో రాజుగారి గది 3 కి ఎదురు లేదనే చెప్పవచ్చు..