బాల‌య్య సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శీను కాంబినేష‌న్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబోలో ఇప్ప‌టికే సింహా, లెజెండ్ సినిమాలు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యాయి. ఇక ఇప్పుడు బాల‌య్య కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూర‌ల్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న రిలీజ్ కానుంది.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే బోయ‌పాటి సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. బోయపాటి శ్రీను ఇటీవలే స్క్రిప్ట్ పనిని పూర్తి చేశారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తాజా వార్తల ప్రకారం, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించబోతున్నాడ‌ట‌. బోయ‌పాటి ఇప్ప‌టికే సంజ‌య్‌దత్‌ను క‌లిసి స్క్రిఫ్ట్ గురించి వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

త్వరలో సంజ‌య్‌ద‌త్ న‌టించే విష‌యం గురించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించ‌నున్నారు. ఇక బోయ‌పాటి – మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి కాంబోలో ఇప్ప‌టికే జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా బోయ‌పాటి – బాల‌య్య కాంబోలో వ‌చ్చే సినిమా హ్య‌ట్రిక్ అవుతుంద‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Share.