నందమూరి అభిమానులు, ప్రత్యేకించి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిణామం… నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిని రంగ ప్రవేశం. వెండి తెర మీద బాలయ్య నట వారసుడ్ని ఎప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ మాత్రం తన వారసుడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముందు రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞ నటిస్తాడని కథ కూడా సిద్దమైంది అనే ప్రచారం జరిగింది. మరి ఏమైందో ఏమో దాని గురించి ఇప్పటి వరకు ఏ వార్తా బయటకు రాలేదు.
ఇక క్రిష్ దర్శకత్వంలో నటిస్తాడు అనే ప్రచారం కూడా జరిగింది. బాలకృష్ణ, క్రిష్ మధ్య చర్చలు కూడా జరిగాయని… నిర్మాతగా బాలయ్యే ఉంటారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు అందులో ఏ కదలిక కనపడలేదు. ఇటీవల బాలకృష్ణ కుటుంబానికి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు.. కాని అతను మాత్రం కాస్త పొట్ట, చింపిరి జుట్టు తో కనపడటం తో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ లుక్‌లో మోక్షజ్ఞను చూసి బాలయ్య అభిమానులు షాక్ అయిపోయారు. మోక్షజ్ఞ కు సినిమాల మీద ఆసక్తి లేదని, అందుకే ఇలా ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి నందమూరి అభిమానుల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మరి కొంత మంది అయితే… అతనికి సినిమాల మీద ఆసక్తి ఎంత మాత్రం లేదని కాబట్టి రాజకీయాల్లోకి పంపిస్తే పదేళ్ళలో సిద్దంగా ఉంటాడని అంటున్నారు. ఇక బాలకృష్ణ కూడా తన కుమారుడి సిని రంగ ప్రవేశం విషయంలో పెద్ద ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా అతని సిని ప్రవేశం విషయంలో ఎన్నో ఆశలుపెట్టుకున్న నందమూరి అభిమానులకు ఈ వార్తలు తీవ్ర నిరుత్సాహం కలిగిస్తున్నాయి.